మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రభుత్వం నిర్వహించిన ‘శౌర్యవీర’ కార్యక్రమంలో 5 వేల మంది మహిళలు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి కత్తి విన్యాసాలు చేశారు. ఈవెంట్లో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ కూడా స్టేజీపై రెండు చేతులతో కత్తులను పట్టుకుని తన విద్యను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.