బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ లో సంబంధిత అధికారి నిబంధనలు పాటించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు అతిమల నగేష్ ఆధ్వర్యం లో బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో బోధన్ పట్టణ డీలర్ల సంఘం అధ్యక్షులు భీష్మ గౌడ్, మండల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు డీలర్లు పాల్గొన్నారు.