బోధన్: టపాసుల దుకాణాలకు అనుమతి తప్పనిసరి

78பார்த்தது
బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం టపాసుల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న టపాసుల విక్రయదారులు సంబంధిత పోలీస్, ఫైర్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. దుకాణదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி