బాన్సువాడ: చికిత్స పొందుతూ మహిళ మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన దంపతులు మూడ జనార్దన్, భాగ్యలక్ష్మి దంపతులు బైక్పై వెళ్తుండగా శుక్రవారం కొత్తబాది వద్ద ఆటో ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మి సోమవారం మృతి చెందింది. జనార్దన్ పరిస్థితి సైతం విషమంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.