తడి పొడి చెత్తను వేరుచేసి ప్రతి వీధిలోకి వచ్చే గ్రామ పంచాయతీ వాహనంకు ప్రజలు అందజేయాలని బాన్సువాడ ఎంపీడీవో బశిరోద్దీన్ కోరారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం తడి, పొడి చెత్తపై బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో ర్యాలీ గా వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ చెత్తను డ్రైనేజీ, బహిరంగ ప్రదేశాల్లో పాడేయడం వల్ల దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడతారని అన్నారు.