కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో రూ. 6. 70 కోట్లతో నూతనంగా నిర్మించిన మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. విద్యతోనే విద్యార్థుల జీవితానికి వెలుగని, పేదలు ఆర్ధికంగా బాగుపడాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. మౌలిక వసతులు కల్పించడం తమ బాధ్యతని అన్నారు.