వీధి దీపాల కోసం గ్రామస్తుల రిలే నిరాహార దీక్ష

72பார்த்தது
వీధి దీపాల కోసం గ్రామస్తుల రిలే నిరాహార దీక్ష
గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్తులు ఏకంగా గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం నిరాహారదీక్ష నిర్వహించారు. రాత్రివేళలో లైట్లు లేక చీకట్లో గ్రామస్తులు పలుమార్లు పాముకాట్లకు గురయ్యారని, ఈ సమస్యపై గ్రామపంచాయతీ సెక్రటరీకి, మండల అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతోనే రిలే నిరాహార దీక్షు దిగినట్లు గ్రామస్తులు తెలిపారు.

தொடர்புடைய செய்தி