బాన్సువాడ పట్టణంలో వాహనాలను స్థానిక ఎస్ఐ మోహన్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలను, నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వాహనాలు తనిఖీకి వాహనదారులు సహకరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట పెట్టుకోవాలన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, వాహనాల పై ఉన్న పెండింగ్ చాలన్లను వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.