నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే మాలల ఆత్మగౌరవ బహిరంగ సభకు ఆదివారం నియోజకవర్గం నుండి మాల మహానాడు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, కౌన్సిలర్ వెంకటేష్, మేకల సాయిలు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.