బాన్సువాడ నియోజకవర్గం, మండలం చింతల్ నాగరం శివారు మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అని సోమవారం రైతులు తెలిపారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుకను తోడడంతో భూగర్భజలాలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.