ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తుందని నసురుల్లా బాద్ ఎంపీపీ పాల్త్య విఠల్ అన్నారు. గురువారం మహిళలకు బతుకమ్మ కానుకలుగా అందించే చీరలను సంగం, హాజీపూర్ గ్రామాల్లో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మజీద్, మైలారం సొసైటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, సర్పంచ్ అరిగే అంజయ్య, పంచాయితీ కార్యదర్శి రజిత పాల్గొన్నారు.