బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో గ్రామస్తులు ,యువకులు ఏకమై మద్యపానం వల్ల జరిగే అనర్థాలపై శనివారం గ్రామస్తులందరూ చర్చించి గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం జరపాలని గ్రామం మద్యపాన నిషేధం తీర్మానం చేశారు. మధ్య నిషేధం ఈనెల 21 నుండి అమలులోకి వస్తుందని , గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపిన వారిపై 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.