చందూర్ మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం జాప్యానికి నిరసనగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చడం లేదని, దేశంలో రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.