ఈ ఫోటో చూశారా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సమాచారం హక్కు చట్టం బోర్డు ఇది. బోర్డు అయితే ఉంది కానీ ఇందులో సమాచారం లేదు. ప్రస్తుతం ఇది ఖాళీగా దర్శనమిస్తోంది. దీనిపై పూర్తి సమాచారం పొందుపరిచాల్సిన అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీంతో మండల సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.