కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పింది. రహదారుల మరమ్మత్తుల కొరకు 498 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం ధన్యవాదములు తెలిపిన బాన్సువాడ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు. రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు దెబ్బ తినడంతో వాటి పనులకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు.