రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గ యువత కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాకు డెబ్బె రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు విచ్చేసి విద్యార్హతల ఆధారంగా కంపెనీల ప్రతినిధులు ఎంపిక చేశారు. స్పీకర్ మాట్లాడుతూ యువతకు
ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ మేళాను ఏర్పాటు చేశారన్నారు.