కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీని కామారెడ్డిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు రావలసిన ఫీజు రియంబర్స్ మెంట్ ని త్వరితగతిని విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హరిస్మరణ రెడ్డి, జైపాల్ రెడ్డి, గురువేందర్ రెడ్డి, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.