అన్న‌ప్ర‌సాదంలో జెర్రి.. స్పందించిన టీటీడీ

85பார்த்தது
అన్న‌ప్ర‌సాదంలో జెర్రి.. స్పందించిన టీటీడీ
అన్న ప్రసాదంలో జెర్రి పడిందన్న విషయంపై టీటీడీ స్పందించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు అవాస్త‌వ‌మ‌న్నారు. "తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలను తయారుచేస్తున్నాం. అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరం. ఇది కావాల‌నే చేసిన చ‌ర్య‌గా మేము భావిస్తున్నాం అని" ఒక అధికారి తెలిపారు.

தொடர்புடைய செய்தி