జపాన్‌కు చెందిన నిహన్ హిడంక్యో సంస్థకు 2024 నోబెల్ శాంతి పురస్కారం లభించింది. హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడిలో దెబ్బతిన్న బాధితుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని ఆ సంస్థ కోరుకుంటున్నట్లు నార్వేయన్ నోబెల్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది. న్యూక్లియర్ ఆయుధాలను మళ్లీ వాడరాదు అని ఆ సంస్థ ప్రత్యక్ష బాధితులతో ప్రదర్శనలు ఇచ్చినట్లు కమిటీ పేర్కొన్నది.