AP: తిరుపతి తొక్కిసలాట ఘటననూ రాజకీయం చేయాలని వైసీపీ అధినేత జగన్ చూడటం సరికాదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాoప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "తండ్రి శవంతోనే రాజకీయం ప్రారంభించిన జగన్... సీఎం అవ్వడం కోసం బాబాయ్ శవాన్ని వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. శవరాజకీయాలను పేటెంట్‌గా తీసుకున్న జగన్ ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వాలటమే పనిగా పెట్టుకున్నారు. " అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.