TG: అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. చంపిన వాళ్లే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అని విమర్శించారు. నేడు జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంబేద్కర్ జీవితమే తమకు స్ఫూర్తి అని, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.