ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? నియంత పాలనా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తమ భూములు కావాలని అడిగినందుకు గిరిజన రైతులను నెల రోజులకు పైగా జైల్లోనే ఉంచారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ నియోజకవర్గానికి చెందిన రైతులు జైల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూమి ఇవ్వని రైతులను జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ పెడతామంటే అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.