రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్కోప్ వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో 53 ఇరాన్ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇరాన్‌కు చెందిన కౌసర్ హోడోడ్‌తో సహా చిన్న ఉపగ్రహాల శ్రేణిని రష్యా ప్రయోగించింది. దీంతో మిత్రదేశాలైన టెహ్రాన్, మాస్కో బంధం మరింత బలోపేతమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు అయినోస్పియర్ పొరను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.