AP: ఐపీఎల్ బెట్టింగ్‌లో బకాయి సొమ్ము రూ.50 ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిపై మరో యువకుడు గాజు పెంకుతో దాడి చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చోటు చేసుకుంది. నవీన్, గంగా మహేశ్ నాలుగు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ గెలుపోటములపై రూ.150 విలువైన మద్యం సీసా ఇచ్చే ఒప్పందం చేసుకున్నారు. నవీన్ రూ.100 చెల్లించాడు. రూ.50 ఇవ్వాలని నవీన్‌తో గంగా మహేశ్ ఘర్షణకు దిగాడు. గాజు సీసా పగలకొట్టి ఆ పెంకుతో దాడి చేశాడు.