త్వరలో భారతదేశపు తొలి స్లీపర్‌ వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌

53பார்த்தது
త్వరలో భారతదేశపు తొలి స్లీపర్‌ వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశపు తొలి స్లీపర్‌ వందే భారత్‌ రైలు త్వరలో ట్రయల్‌ రన్‌ మొదలవనుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. అయితే ట్రయల్‌ రన్‌ పూర్తయ్యేందుకు దాదాపు రెండునెలల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తొలి రైలు ఏ మార్గంలో నడుస్తుందనే చర్చ సాగుతోంది. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నుంచి ప్రారంభించేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி