చరిత్ర సృష్టించిన భారత్‌.. ఒకేసారి రెండు స్వర్ణ పతకాలు

57பார்த்தது
చెస్‌ ఒలింపియాడ్‌ ఓపెన్‌ విభాగంలో భారత్‌ చరిత్ర సృష్టించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ముందుగా పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిళా టీమ్‌ కూడా తన అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవశం చేసుకుంది. 97 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్‌ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. అందులోను ఈసారి పురుషులు, మహిళల జట్టులో కూడా స్వర్ణ సాధించడం మరో విశేషం.

தொடர்புடைய செய்தி