భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ 304 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. డకెట్ (65), జోరూట్ (69) దూకుడుగా ఆడడంతో 50 ఓవర్లలో 304 పరుగులు చేసి భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. టీమిండియా బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, పాండ్యా, షమీ చెరో వికెట్ తీశారు.