చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే జలుబు దూరం

52பார்த்தது
చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే జలుబు దూరం
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. పాలలో కొద్దిగా పసుపును కలిపి తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. అలాగే బార్లీ గింజలను ఉడికించిన నీటిలో నిమ్మరసం వేసుకొని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. రోజూ అల్లం టీ గాని, తులసి టీ గాని తీసుకోవడం మంచిది. వామును వేడి నీటిలో వేసుకొని మరిగించి తీసుకోవడం వల్ల జలుబు దరిచేరదు.

தொடர்புடைய செய்தி