TG: మాజీ మంత్రి KTR గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను TPCC చీఫ్ మహేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ KTR అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు KTR. కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు' అని మహేష్ వార్నింగ్ ఇచ్చారు.