రెయిన్ బజార్ డివిజన్ పరిధిలో దశలవారీగా అభివృద్ది పనులను పూర్తి చేస్తున్నామని డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ వశీయుద్దీన్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని చంద్రనగర్ లో కొనసాగుతున్న సీవరేజ్ లైన్ పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.