యువ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన

969பார்த்தது
యువ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన
యువ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసం యువ నేత రాహుల్ గాంధీ చేశారని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 3500 కిలోమీటర్లు, 150 రోజుల పాదయాత్రగా చేసి దేశ ఐక్యతను చాటి కులమత బేధాలు లేకుండా అందరం కలిసి మెలసి ఉండాలనే సంకల్పలతో చేస్తున్న ఈ మహా పాదయాత్రకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. భావి ప్రధాని యువ కిరణం రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ యాత్ర ద్వారా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி