అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తామని టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం మల్లాపూర్ లోని ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఫంక్షన్ హాల్ లో యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు పళ్ళ మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉప్పల్ నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల నుంచి దరఖాస్తుల స్వీకార ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.