124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణలో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్ విభాగం అధికారులు, కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్, శ్రీ నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ శ్రీ మాధవరం రంగరావు గార్ల తో కలిసి పాదయాత్ర చేశారు. అనంతరం 100 ఫీట్ రోడ్డు విస్తరణకు చేపట్టవలసిన చర్యలను పరిశీలించడం జరిగింది.