తూంకుంట మున్సిపల్ పరిధిలోని పోతాయిపల్లిలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, పోతాయి పల్లి మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగుతుంది.ఈ జోడోయాత్రకు ముఖ్య అతిథిగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి బుధవారం హాజరైనారు. గ్రామంలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి, కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం గడప గడపకు తిరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఇంటింటికి తిరిగి బి ఆర్ యస్, బిజెపి ప్రభుత్వాలు చేసిన మోసాలను నాయకులు వివరించినారు.
కేంద్రం లో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు, రైతులకు 2 లక్షల ఋణమాఫీ, ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
ఈ జోడోయాత్రలో హరి వర్ధన్ రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అద్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, మేడ్చల్ జిల్లా నాయకులు గౌడవెల్లి బాల్ రెడ్డి, మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి, శామీర్ పేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ గౌడ్, తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ సమన్వయ కర్తలు భూషణం, యూసఫ్, తూంకుంట మున్సిపల్ నాయకులు జనార్దన్ రెడ్డి, మురళి గౌడ్, లక్ష్మీనారాయణ , ధర్మారెడ్డి,
నానిగళ్ళ హరి బాబు, శ్రీనివాస్ యాదవ్, మల్లేష్ రమేష్, నియోజకవర్గ నాయకులు నానా వత్ సురేష్ నాయక్, మెట్టు రమేష్, దొడ్ల మోహన్, సత్తయ్య గౌడ్ , నల్ల మధుసూదన్ రెడ్డి, కందాడి సత్తిరెడ్డి, తుంకి బిక్షపతి, గడ్డం రమేష్, భాస్కర్ గౌడ్, నాగేష్ గౌడ్, ఎం రమేష్ , కృష్ణ, నరసింగరావు గౌడ్, పాండు, అమరేందర్, కోరిపల్లి మహేష్, నవీన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నవీన్, కార్తీక్ రెడ్డి, మధు , రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు