రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట వివేకానంద కాలనీలోని బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు శివలింగంను ధ్వంసం చేశారనే ఆరోపణలపై శుక్రవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పట్టణం పోలీసులకు ఫిర్యాదు రావడంతో పట్టణ సిఐ విజయ్ కుమార్ పరిశీలించారు. వెంటనే దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.