సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వేలాది సంఖ్యలో ప్రయాణికులు తరలివస్తున్నారు. గత రెండు రోజుల నుంచి ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో ఆల్ఫా హోటల్ ఎదురుగా ట్రాఫిక్ జామైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ పూర్తిగా ప్రయాణికుల వాహనాలతో నిండిపోయింది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు సొంతూరు బాట పట్టారు.