మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.