కంటోన్మెంట్ డివిజన్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. గురువారం మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.