రాంనగర్ జై దుర్గా భవాని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై దుర్గా మాతకు పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాస్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్ నాగులు యాదవ్, గొల్ల శ్రీను, ఆకారం శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్, నవీన్ యాదవ్, ఉదయ్ భాస్కర్, అభి యాదవ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.