సికింద్రబాద్ లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సోమవారం పరిశీలించారు. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ముగ్గురు ముస్లీం యువకులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు పారిపోగా ఒకడిని స్థానికులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించి ఘటన జరిగిన తీరును స్థానికులను, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.