బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మహేందర్ యాదవ్

162பார்த்தது
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మహేందర్ యాదవ్
బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బోయిన్‌పల్లికి చెందిన సలంద్రి మహేందర్ యాదవ్‌ను నియమిస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ రాజ్ ఆదివారం నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలె భాస్కర్ రాజ్ మాట్లాడుతూ బీజేపీ పటిష్టానికి కృషి చేయాలని అన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఎప్పుడూ లేని విధంగా ఓబీసీ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

మహేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రోజురోజుకు పుంజుకుంటుందన్నారు. ఓబీసీ మోర్చా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి లాభాల గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తానని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కి, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు అలే భాస్కర్ రాజ్‌కి, ప్రధాన కార్యదర్శి ఉడత మల్లేష్ యాదవ్, సెక్రెటరీ సంజయ్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు సలంద్రి శ్రీనివాస్ యాదవ్, బీజేపీ సీనయర్ నాయకులు జంపన్న ప్రతాప్, జే రామకృష్ణ, భానుక మల్లికార్జున్, ఈ శ్రీశైలం యాదవ్, బత్తుల శ్రీనివాస్ యాదవ్‌లకు ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி