సికింద్రాబాద్ ఘటనపై పోలీసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చించారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు. మందిరాలపై దాడులు చేస్తే సహించేది లేదని తెలిపారు. ఈ దాడి హిందువులకు అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి విచారణ చేపట్టి మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.