తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై ఆయన అధిష్ఠానంతో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దలను ఆహ్వానిస్తారని సమాచారం. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.