హైదరాబాద్ లో కొంతకాలంగా వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. మతిస్తిమితం లేని వారు చేశారని ఒక చోట, దొంగతనానికి వచ్చారని మరోచోట పోలీసులు చెప్పడం మసిపూసి మారేడు కాయ చేయడమే అని మండిపడ్డారు. ఇది కచ్చితంగా మతోన్మాద శక్తుల పనేనని, వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.