గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు చిలకలగూడ పోలీసులు శనివారం తెలిపారు. గాంధీ ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధున్ని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఫొటోలోని వ్యక్తిని గుర్తుపట్టిన వారు చిలకలగూడ పోలీసులను సంప్రదించాలని కోరారు.