బోయినపల్లిలోని ప్రసిద్ధి తాడ్బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం మహా అన్నకూట మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శంకరాచార్య మహా సంస్థానం జగద్గురు పుష్పగిరి పీఠాధీశులైన శ్రీ విద్యాశంకర భారతీ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మహా అన్నకూటమి మహోత్సవాన్ని ప్రారంభించారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు.