సికింద్రాబాద్: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ పేషెంట్ అదృశ్యం

77பார்த்தது
సికింద్రాబాద్: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ పేషెంట్ అదృశ్యం
ట్రీట్మెంట్ పొందుతూ పేషెంట్ కనిపించకుండా పోయిన ఘటన గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. చిలకలూడ ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు. మొయినాబాద్కు చెందిన ఎం. కృష్ణ (64) అనారోగ్యంతో గాంధీలో అడ్మిట్ అయ్యాడు. భార్య కల్పలత వాష్ రూమ్ కు వెళ్లి వచ్చేసరికి ఆయన వార్డులో కనిపించకుండా పోయాడు. చాలా చోట్ల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టినవారు తమను సంప్రదించాలని ఎస్సై కోరారు.

தொடர்புடைய செய்தி