సీతాఫల్మండిలోని డబల్ బెడ్ రూం సముదాయాల నుంచి జోషి కాంపౌండ్ వరకు నూతనంగా నిర్మించబోయే స్ట్రాం వాటర్ పైప్ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ డాక్టర్ హేమ సామల వివిధ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత కొరవడకూడదని పేర్కొన్నారు. ప్రజలకి ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.