సేవా కార్యక్రమాలకు సనత్ నగర్ సీనియర్ సిటిజన్స్ ఆదర్శంగా నిలుస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్‌నగర్ బి కే గూడ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆఫీస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరన్ స్టెప్స్‌ను ప్రారంభించారు. ఆఫీస్‌లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ తో ముచ్చటించారు. తమ వయసును సైతం లెక్కపెట్టకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.