నగరంలో మరో అగ్నిప్రమాదం

83பார்த்தது
నగరంలో సోమవారం మరో అగ్నిప్రమాదం సంభవించింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మహాదేవపురంలోని శ్రీసాయి ఎంటర్ ప్రైజేస్ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిడిపడడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி